¡Sorpréndeme!

YS Jagan's Challenge : He Only Prove That He Was Not Corrupted | Oneindia Telugu

2017-11-10 420 Dailymotion

AP CM Chandrababu Naidu responded over YS Jagan's challenge. He said that is not our business, he only prove whether he corrupt or clean

ప్యారడైజ్ పేపర్స్‌లో తన పేరు ఉందని ప్రచారం చేస్తున్న టీడీపీ.. దమ్ముంటే 15రోజుల్లోగా తనకు విదేశాల్లో ఆస్తులున్నాయన్నది నిరూపించాలని వైసీపీ అధినేత జగన్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.ప్రజా సంకల్ప యాత్ర సమయంలో ఇలాంటి ప్రచారం ద్వారా తమ పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ప్రజలెవరూ టీడీపీ మాటలను నమ్మబోరని కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు జగన్ సవాల్ పై స్పందించారు.
జగన్ అవినీతిపరుడో? కాదో? అన్నది నిరూపించుకోవాల్సింది ఆయనేనని, తన వద్ద అక్రమాస్తులు లేవని నిరూపించుకోవాలని చంద్రబాబు అన్నారు. జగన్ అవినీతి సొమ్ము రాష్ట్రానికే దక్కాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈడీ జప్తు చేసిన ఆస్తులను రాష్ట్రానికి ఇవ్వాలని, అది రాష్ట్ర ప్రజలకు మాత్రమే చెందాలని స్పష్టం చేశారు. గురువారం నిర్వహించిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.